భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం
కదిరి, 5 అక్టోబర్ (హి.స.), కదిరి పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ రోజు ఆదివారం ఉదయం భక్తులతో కిటకిటాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్త
భక్తులతో కిటకిటాడిన ఖాద్రీశుడి ఆలయం


కదిరి, 5 అక్టోబర్ (హి.స.), కదిరి పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ రోజు ఆదివారం ఉదయం భక్తులతో కిటకిటాడింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయం భక్తులతో నిండిపోయింది.వారాంతపు సెలవు రోజుకావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.

సెలవులు ముగియ డంతో భక్తులు తమ పని ప్రదేశాలకు వెళ్లే క్రమంలో దైవ దర్శనం చేసుకునేందుకు అధికంగా వచ్చారు. ఆలయ ఆధికారులు అన్నదా నంతో పాటు ఇతర వసతులు కల్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande