నకిలీ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపణ
అమరావతి, 5 అక్టోబర్ (హి.స.): మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జ
జగన్


అమరావతి, 5 అక్టోబర్ (హి.స.): మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టిడిపి నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీనాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.

లిక్కర్‌ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్‌లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్‌ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్‌ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు తెరిచారని ఆయన ఆరోపించారు. కల్తీ లిక్కర్‌ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కాని విచారణ, దర్యాప్తు తూతూమంత్రంగానే సాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande