అమరావతి, 5 అక్టోబర్ (హి.స.)ఏపీలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు వదలడం లేదు. ఇక నేడు సైతం పలు జిల్లాల్లో భారీ వర్షలతో పాటు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, మన్యం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునగ్గా మరోసారి వర్షసూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV