కురుపాం, అనంతపురం ఘటనలపై సీఎం ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
అమరావతి, 5 అక్టోబర్ (హి.స.) మన్యం జిల్లా కురుపాం(kurupam)లోని గురుకుల పాఠశాల(Gurukula Pathasala)లో పచ్చకామెర్లు విజృంభించాయి. దీంతో 60 మంది విద్యార్థులు(Students) ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 38 మందికి పచ్చకామెర్లు(Jaundice) తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు
చంద్ర బాబు


అమరావతి, 5 అక్టోబర్ (హి.స.) మన్యం జిల్లా కురుపాం(kurupam)లోని గురుకుల పాఠశాల(Gurukula Pathasala)లో పచ్చకామెర్లు విజృంభించాయి. దీంతో 60 మంది విద్యార్థులు(Students) ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 38 మందికి పచ్చకామెర్లు(Jaundice) తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం 19 మంది విద్యార్థులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దసరా పండగ తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లి తిరిగిన వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు.

ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు విద్యార్థులకు ఎలా పచ్చ కామెర్లు వచ్చాయనే విషయంపై వైద్యాధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.

అయితే ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. కురుపాంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా తీశారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు అనంతపురం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు. ఆస్పత్రిలో శిశువు మృతి చెండదంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande