ఢిల్లీ, 06 అక్టోబర్ (హి.స.) మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సంచలన ప్రకటన చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అర్హుడిని కాదని భావిస్తున్నాను.. అనివార్య పరిస్థితుల వల్లే పార్టీని వీడుతున్నాను ని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ కు మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ తెలిపారు. మావోయిస్టు పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేక పోయామంటూ మల్లోజుల క్షమాపణలు చెప్పుకొచ్చారు.
అయితే, పార్టీ క్యాడర్ ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమే.. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మన లక్ష్యాన్ని నెరవేర్చలేం.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ