బ్యాంకింగ్, ఐటీ షేర్లకు సానుకూలతలు,గురువారం టీసీఎస్‌ ఫలితాలపై దృష్టి,విశ్లేషకుల అంచనాలు
ముంబై,06,అక్టోబర్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కూడా లాభాలను కొనసాగించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 కీలక 24,800 పాయింట్ల పైన ముగియడం ఇందుకు నేపథ్యం. అయితే అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా షట్‌డౌన్‌ పరిణా
Pressure on stock market in early trade, Sensex and Nifty fall


ముంబై,06,అక్టోబర్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కూడా లాభాలను కొనసాగించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50 కీలక 24,800 పాయింట్ల పైన ముగియడం ఇందుకు నేపథ్యం. అయితే అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, అమెరికా షట్‌డౌన్‌ పరిణామాల వల్ల లాభాలు పరిమితంగా ఉండొచ్చు. వృద్ధిరేటు అంచనాలను ఆర్‌బీఐ పెంచడం, సాధారణం కంటే అధిక వర్షాలు, పండగ గిరాకీ వంటివి మార్కెట్‌ సెంటిమెంటును సానుకూలం చేశాయి. కార్పొరేట్‌ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు గురువారం టీసీఎస్‌తో మొదలుకానున్నాయి. అమెరికా టారిఫ్‌లు మూడో త్రైమాసికంలో కార్పొరేట్‌ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని భావిస్తున్న తరుణంలో, కంపెనీల భవిష్యత్తు అంచనాలు కీలకం కానున్నాయి. విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు సెప్టెంబరులో రూ.23,885 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande