దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో హింసాత్మక ఘర్షణ.. కటక్‌లో తాత్కాలికంగా ఇంటర్నెట్ బంద్
కటక్‌:, 6 అక్టోబర్ (హి.స.)దర్గా బజార్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో డీసీపీ, దర్గా బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఐఐసీ) సహా ఆరుగురు పోలీసు అధికారులు, కొంతమంది మీడియా సిబ్బ
దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో హింసాత్మక ఘర్షణ.. కటక్‌లో తాత్కాలికంగా ఇంటర్నెట్ బంద్


కటక్‌:, 6 అక్టోబర్ (హి.స.)దర్గా బజార్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో డీసీపీ, దర్గా బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఐఐసీ) సహా ఆరుగురు పోలీసు అధికారులు, కొంతమంది మీడియా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన అశాంతి నేపథ్యంలో ఊరేగింపులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా నిరసనలు చోటుచేసుకున్నాయి.

ఈ సంఘటన తర్వాత కటక్ పోలీస్ కమిషనరేట్ దుండగులను గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషనర్ ఎస్.దేవ్ దత్తా సింగ్ మాట్లాడుతూ.. దుండగులను గుర్తించడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరసనకారులను గుర్తించి వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిందితులపై కఠినంగా, సత్వర చర్యలు తీసుకోవాలని బృందాలను ఆదేశించారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కటక్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande