కర్నూలు, 7 అక్టోబర్ (హి.స.)భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. సరైన మోతాదులో బెల్లాన్ని తింటే.. ఆరోగ్యానికి అనేక విధాలుగా హెల్ప్ అవుతుంది. బెల్లాన్ని చెరకు రసంలో మరిగించి తయారు చేస్తారు. బెల్లం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది ఎంజైమ్‌లు యాక్టివేట్ అయి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. బెల్లం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది ఎంజైమ్‌లు యాక్టివేట్ అయి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
ఆహారం తిన్న తర్వాత అజీర్ణం, గ్యాస్ సమస్య ఉన్నవారు బెల్లం తింటే మంచిది. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అలసటను తగ్గిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బెల్లంతో కాలేయం శుభ్రం అవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ. ఇది రక్తహీనత నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే 5-10 గ్రాముల బెల్లం తినడం మంచిది. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చు.
బెల్లం బీపిని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం ఈ బెనిఫిట్స్‌ని అందిస్తాయి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీని డీటాక్సీఫై చేస్తాయి. లివర్‌కి కూడా మంచిది. రోజూ బెల్లం తీసుకుంటే ట్యాక్సిన్స్ దూరమై క్యాన్సర్ సహా ఇతర సమస్యలు దూరమవుతాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లం నేచురల్ బాడీ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇందులోని మాంగనీస్, సెలీనియం వ్యర్థాలను బయటకి పంపుతాయి. ఇవి రక్తశుద్ధి, వాత, పిత్త సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు బెల్లంలో కాల్షియం, ఫాస్పరస్, జింక్‌లు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV