ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.) బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నో మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలంటూ భవిష్యవాణి వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై ప్రశాంత్ కిషోర్ అంచనాలు వెల్లడించారు.
ఈ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ఏమాత్రం ముఖ్యమంత్రి గా ఉండబోరు అని చెప్పారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానని అన్నారు. బీహార్ ప్రజలు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఓట్లు వేయబోతున్నారని తెలిపారు. బతుకుదెరువు వలసలకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయబోతున్నారని వెల్లడించారు. పాట్నా లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో వచ్చే ఏడాది జనవరిలో “మకర సంక్రాంతి” సంబరాలను
నితీష్ కుమార్ చేసుకోరు అని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు