భారత్‌తో ఘర్షణలో చైనా ఆయుధాలు బాగా పనిచేశాయి: పాక్
ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.) పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్‌ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. భారత్‌ (India)కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థల ముందు పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు విఫలమయ్యాయి. అయితే, నిజం ఒప్పుకునేందుకు
భారత్‌తో ఘర్షణలో చైనా ఆయుధాలు బాగా పనిచేశాయి: పాక్


ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.) పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్‌ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. భారత్‌ (India)కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థల ముందు పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు విఫలమయ్యాయి. అయితే, నిజం ఒప్పుకునేందుకు ఇష్టపడని పాక్‌ (Pakistan).. కొత్త వాదనకు తెర లేపింది. భారత్‌తో జరిగిన ఘర్షణల్లో తాము ఉపయోగించిన చైనా (China) ఆయుధాలు బాగా పనిచేశాయని పేర్కొంది.

ఆ దేశ ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ (Ahmed Sharif Chaudhry) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో జరిగిన ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవల అనూహ్యంగా చైనా ఆయుధాలు బాగా పనిచేశాయన్నారు. భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. తమది ఒక్కటి కూడా కోల్పోలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తాము సాంకేతికమైన ఆయుధాలను కలిగిఉన్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande