ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.)బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఆగస్టులో ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది.
ట్రంప్ (Donald Trump) చర్యల నేపథ్యంలో ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీచేసే వీసాల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19శాతం తగ్గింది. కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావడం గమనార్హం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికొస్తే 44 శాతం మేర క్షీణత కనిపించింది (Indian student visas). సాధారణంగా యూఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్ర దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా, ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు