పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
న్యూయార్క్‌/చెన్నై ,07 అక్టోబర్ (హి.స.): దాయాది పాకిస్తాన్‌పై భారత్‌ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్‌) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృ
పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌


న్యూయార్క్‌/చెన్నై ,07 అక్టోబర్ (హి.స.): దాయాది పాకిస్తాన్‌పై భారత్‌ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్‌) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృష్టిస్తూ ప్రపంచాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశాల్లో పాక్‌ అధికారిణి సౌమా సలీమ్‌ మాట్లాడుతూ.. భారత్‌, కశ్మీర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరించారు, ఆక్రమణలో ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాక్‌ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్‌ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను హరీష్ తీవ్రంగా ఖండించారు.

అనంతరం, హరీష్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ మహిళల గురించి పాకిస్తాన్‌ మాట్లాడం విడ్డూరంగా ఉంది. తన సొంత ప్రజలపై బాంబులు వేసుకునే దేశం పాకిస్తాన్‌. ప్రతిసారి భారత్‌పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande