ఢిల్లీ, 07 అక్టోబర్ (హి.స.) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై మరోసారి నిందితుడు రాకేష్ కిషోర్ పరుష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రవర్తించిన తీరుకు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనకెలాంటి భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో రాకేష్ కిషోర్ మాట్లాడుతూ.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మత్తులో ఉండి ఆ పని చేయలేదని.. తాను పూర్తిగా స్పృహలో ఉండే ఆ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. తానేమీ భయపడడం లేదని.. పైగా జరిగిన దానికి ఏ మాత్రం చింతించడం కూడా లేదని పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్‌లో విష్ణువు విగ్రహంపై విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. పిటిషన్ విచారిస్తూ ఎగతాళి చేయడమేంటి? వెళ్లి విగ్రహాన్ని ప్రార్థించు అంటూ ఎటకారంగా మాట్లాడతారా? దేశ సనాతన ధర్మానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ప్రవర్తించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యవహరించే తీరు ఇదేనా? గవాయ్ ఎగతాళి చేయడంతోనే తనకు కడుపు మండిందన్నారు. తాను దాడి చేసేటప్పుడు ఎలాంటి మత్తులో లేనని.. పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
4
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు