25,000 పాయింట్ల ఎగువకు నిఫ్టీ
ముంబై,07,అక్టోబర్ (హి.స.) దేశీయ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. 3 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 1,500 పాయింట్లు దూసుకెళ్లింది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ 25,000 పాయింట్ల ఎగువకు చేరింది. డ
Bombay Stock Exchange


ముంబై,07,అక్టోబర్ (హి.స.) దేశీయ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. 3 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 1,500 పాయింట్లు దూసుకెళ్లింది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ 25,000 పాయింట్ల ఎగువకు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 5 పైసలు పెరిగి 88.74 వద్ద ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 1.78% లాభపడి 65.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ లాభపడగా, హాంకాంగ్‌ సూచీ డీలా పడింది. చైనా, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడాయి.

బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2.03 లక్షల కోట్లు పెరిగి, రూ.459.84 లక్షల కోట్ల (5.18 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 81,274.79 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,207.17) సానుకూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 81,155.88 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. తర్వాత రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ 81,846.42 పాయింట్ల వద్దగరిష్ఠాన్ని తాకింది. చివరకు 582.95 పాయింట్ల లాభంతో 81,790.12 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 183.40 పాయింట్లు పెరిగి 25,077.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 25,095.95-24,881.65 పాయింట్ల మధ్య కదలాడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande