యాదాద్రి భువనగిరి, 9 అక్టోబర్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
మండలం, మోటకొండూరు మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట రమణారెడ్డి, ఎంపీడీవోలు సత్యాంజనేయ ప్రసాద్, ఇందిరా, ఏవో శ్రీనివాస్, హేమంత్ కుమార్, దూడల వెంకటేష్, కర్ణాకర్, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు