హైదరాబాద్ జీడిమెట్ల.లో 220 కిలోల ఎఫిడ్రిన్.పట్టివేత
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) : నగరంలో పోలీసులు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దేశీయంగా రూ.10 కో
హైదరాబాద్ జీడిమెట్ల.లో 220 కిలోల ఎఫిడ్రిన్.పట్టివేత


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

: నగరంలో పోలీసులు భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దేశీయంగా రూ.10 కోట్లు ఉంటుందన్నారు. నగరంలోని ఓ రసాయన పరిశ్రమలో తయారు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande