పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.. కరీంనగర్ కలెక్టర్
తెలంగాణ, కరీంనగర్. 9 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో జిల్లాలోని హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల ఆరు మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 6 జెడ్పిటిసి, 70 ఎంపీటీసీ
కరీంనగర్ కలెక్టర్


తెలంగాణ, కరీంనగర్. 9 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి దశలో జిల్లాలోని హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గల ఆరు మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. 6 జెడ్పిటిసి, 70 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande