నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, 9 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలకు నేటినుండి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం మెదక్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ హవేలీ ఘనపూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్ర
మెదక్ కలెక్టర్


మెదక్, 9 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికలకు నేటినుండి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం మెదక్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ హవేలీ ఘనపూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నోటీస్ ప్రదర్శించిన విధానాన్ని అలాగే హెల్ప్ డెస్క్ విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు వారి విధుల పట్ల ఉన్న అవగాహనను కలెక్టర్ పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande