బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మన్నె క్రిశాంక్ అరెస్ట్
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన చలో బస్ భవన్ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు. బస్ భవన్కు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డు
మన్నే కృశాంక్


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన చలో బస్ భవన్ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు.

బస్ భవన్కు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.

బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు భవనకు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడు అంచల భద్రతతో పోలీసులు పహారా కాస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande