body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
చెన్నై ,09అక్టోబర్ (హి.స.): తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు.
చెన్నై పోలీసులకు కాల్ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే..
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు