హవాలా నిరోధక చట్టంలో డిజిటల్‌ అరెస్టు లేనేలేదు: ఈడీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.)నగదు అక్రమ చలామణి(హవాలా) నిరోధక చట్టం(పీఎ
హవాలా నిరోధక చట్టంలో డిజిటల్‌ అరెస్టు లేనేలేదు: ఈడీ


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.)నగదు అక్రమ చలామణి(హవాలా) నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లో డిజిటల్‌/ఆన్‌లైన్‌ అరెస్టు అనే భావనే లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం స్పష్టం చేసింది. తమ అధికారులు ఎవరినైనా అరెస్టు చేయాల్సి వస్తే సంబంధిత నియమ నిబంధనలను పాటిస్తూ ఆయా వ్యక్తులను నేరుగా అదుపులోకి తీసుకుంటారని తెలిపింది. సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసగించి డబ్బు కాజేయడం కోసం డిజిటల్‌/ఆన్‌లైన్‌ అరెస్టులంటూ హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఈడీ ఈ ప్రకటనను వెలువరించింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని, అయితే దీనిలో వ్యక్తులను అరెస్టు చేయడం ఉండదని ఈడీ అధికారులు వివరించారు. ఈడీ పేరుతో జారీ అయ్యే సమన్లు అసలైనవో, నకిలీవో తెలుసుకునేందుకు సంస్థ వెబ్‌సైట్‌ https://enforcementdirectorate.gov.in ద్వారా నిర్ధారించుకోవచ్చని తెలిపారు. సెలవులు, శని, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో సమన్లు జారీ అయిన 24 గంటల తర్వాత వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించుకోవచ్చన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande