ఏఐను దుర్వినియోగం చేయొద్దు: ఈసీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఏఐను దుర్వినియోగం చేయొద్దు: ఈసీ


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.)బిహార్‌ శాసనసభ ఎన్నికల (Bihar Assembly Election 2025)కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసీ (Election Commission) రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో డీప్‌ఫేక్‌లను సృష్టించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేందుకు కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది.

ఈ మేరకు గురువారం ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకునే విషయాలు ఏఐ జనరేటెడ్‌ లేదా కల్పితమైనవి అయితే ఆ విషయాన్ని కచ్చితంగా స్పష్టంచేయాలని పేర్కొంది. పార్టీలు, స్టార్‌ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ప్రముఖంగా ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాల్లోని పోస్టులపై నిఘా ఉంటుందని హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉందని ఈసందర్భంగా నొక్కి చెప్పింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఈసీ ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. ఇక, బిహార్‌లో నవంబరు 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande