ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇవాల్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇవాల్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీ మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు. పూర్తిస్థాయిలో సమయం కేటాయించి నామినేషన్ల ప్రక్రియకు సమయం కేటాయించాలన్నారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్ కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. గాంధీ భవన్ లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో- ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande