హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
జంట నగరాల్లోని ఆర్టీసీ బస్సుల్లో చార్జీలను పెంచుతూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, పేదలపై పెను భారం మోపేలా చార్జీల పెంపును నిరసిస్తూ.. బీఆర్ఎస్ 'చలో బస్ భవన్'కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నిరసనపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఆర్టీసీని విధ్వంసం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. మళ్లీ నేడు వారు చార్జీల పెంపు, ఆర్టీసీ కార్మికుల కష్టనష్టాలపై మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.
నాడు 40 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఆర్టీసీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసీని క్రమంగా ప్రభుత్వ పరం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు గందరగోళం సృష్టించడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. నేడు ఆర్టీసీ నిలబడిందని, ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అని అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..