ఇకనుండి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..
తెలంగాణ, 9 అక్టోబర్ (హి.స.) డ్రంక్ అం డ్రైవ్ తనిఖీలు అంటే కేవలం రాత్రి సమయంలోనే చేస్తారనుకుంటే పొరపాటే. కొందరు మందుబాబులు డే టైంలో తప్పతాగి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మధ్యకాలంలో స్కూల్ వ్యాన్లు, వాటర్ ట్యాంకర్ వాహనాలు నడిపే డ్రై
డ్రంక్ అండ్ డ్రైవ్


తెలంగాణ, 9 అక్టోబర్ (హి.స.)

డ్రంక్ అం డ్రైవ్ తనిఖీలు అంటే

కేవలం రాత్రి సమయంలోనే చేస్తారనుకుంటే పొరపాటే. కొందరు మందుబాబులు డే టైంలో తప్పతాగి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మధ్యకాలంలో స్కూల్ వ్యాన్లు, వాటర్ ట్యాంకర్ వాహనాలు నడిపే డ్రైవర్లు ఉదయం సమయంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టు పడ్డారు. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళారు. అయితే మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదని డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ కొనసాగుతోంది. గురువారం ఉదయం జాయింట్ సీపీ డేవిడ్ జోయల్, ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రివనం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడిన సమయంలో ఎస్ఐలు నాగరాజు, రాంబాబులతో కలిసి ఎస్సార్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇతరులకు నష్టం జరుగుతోంది. ముఖ్యంగా స్కూల్ వ్యాన్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande