హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్కు మజ్లిస్పార్టీ మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఊపందుకున్నది. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేయగా 41,656 ఓట్లు వచ్చాయి. మాగంటి గోపీనాథ్కు నవీన్ యాదవ్లట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. పార్టీకి సుమారు 4.28 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ఆరఫున అజారుద్దీన్కు గణనీయమైన స్థాయిలో ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మజ్లిసో పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్తో మైత్రి కుదిరిందన్న టాక్వినిపిస్తున్నది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..