బీఆర్ఎస్ చలో బస్ భవన్.. కేటీఆర్ హౌస్ అరెస్ట్..
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ''చలో బస్భవన్'' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
కేటీఆర్


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ 'చలో బస్భవన్' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతోపాటు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై, ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని, ఇలాంటి పోలీసు నిర్బంధాలు తముకు, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande