లోకల్ బాడీ ఎలక్షన్స్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ, ఖమ్మం. 9 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలకు గాను నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధిత రిటర్నింగ్ అధికా
లోకల్ బాడీ


తెలంగాణ, ఖమ్మం. 9 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికలకు గాను నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం షురూ అయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు కల్పించనున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు, 283 ఎంపీటీసీలు ఉండగా, భద్రాద్రి జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో ఆశావహుల నుంచి ఈనెల 11 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 13న అప్పీళ్ల స్వీకరణ, 14న విచారణ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో జిల్లాలో ప్రధాన పార్టీల్లో ఆశావహులు సమాయత్తం అవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande