బీసీ రిజర్వేషన్లు ఓ సామాజిక విప్లవం.. టీపీసీసీ చీఫ్
తెలంగాణ, 9 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఓ సామాజిక విప్లవమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ జరిగిన పార్టీ జూమ్ మీటింగ్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ
టీపీసీసీ చీఫ్


తెలంగాణ, 9 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం

రిజర్వేషన్లు దేశ చరిత్రలోనే ఓ సామాజిక విప్లవమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ జరిగిన పార్టీ జూమ్ మీటింగ్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ , రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేశాయని తెలిపారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.

అదేవిధంగా నేడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైందని.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు సీరియస్గా తీసుకోవాలని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande