హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో
అద్దంలా ఆర్ అండ్ బీ (R&B) రోడ్లను తయారు చేస్తామని రోడ్లు, భవనా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయం లో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలపాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. యాక్సిడెంట్స్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొన్నారు. .
దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఫేజ్-1లో భాగంగా రూ.10,986 కోట్లతో 5,587 కి.మీ. మేర హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు లేనల నిర్మాణం చేపడుతామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..