హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
సిటీ బస్సుల్లో టికెట్ ధరల పెంపునకు
నిరసనగా బీఆర్ఎస్ పార్టీ 'చలో బస్ భవన్' (Bus Bhavan) కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడంతోపాటు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ పరిపాలనా కార్యాలయన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 600 మందికిపైగా పోలీసుల సిబ్బందిని మోహరించారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి బస్ భవన్ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేశారు.
పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరినీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో నిత్యం ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి వెళ్లలేక ప్రయాణికులు, కార్మికులు, సిబ్బంది, ఇతర వాహనాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ భవన్ సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు