అవయవదానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం. రామగుండం ఎమ్మెల్యే
తెలంగాణ, గోదావరిఖని. 9 అక్టోబర్ (హి.స.) మానవతా విలువలను నిలబెట్టే సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవని, అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం వస్తుందని రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని మెడికల్ కాలేజీలో న
రామగుండం ఎమ్మెల్యే


తెలంగాణ, గోదావరిఖని. 9 అక్టోబర్ (హి.స.)

మానవతా విలువలను నిలబెట్టే

సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవని, అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం వస్తుందని రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖని మెడికల్ కాలేజీలో నిర్వహించిన సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎలాంటి అపోహలు లేకుండా అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర, అవయవ, శరీర దానం చేసిన కుటుంబాలను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande