తెలంగాణ, 9 అక్టోబర్ (హి.స.)
స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
చేసి సిద్ధంగా ఉన్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం, మనూర్, నాగలిగిద్ద, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట్, మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తారు. అక్టోబర్ 9 నుంచి 11 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 12న పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 15న ఉపసంహరణ గడువు ఉండగా, అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను నవంబర్ 11న వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీగా సిద్ధంగా ఉందని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు