Group-1: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందునా ఈ దశలో జోక్యం చేసుకోలేమని
సుప్రీం కోర్ట్


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందునా ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్ట్ ధర్మాసనం గురువారం పేర్కొంది. గ్రూప్ వన్ నియామకాలపై వేముల అనుష్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది ఈ అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈనెల 15నంచారణ ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇదే కేసులో మరో వ్యక్తి వేసిన పిటిషన్పై రెండు రోజుల జోక్యం చేసుకునేందుకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా మరోసారి అదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం రిపీట్ చేయడంతో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించినట్లైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande