హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)
బీసీ రిజర్వేషన్ల పై తెలంగాణ హైకోర్టులో విచారణ పున: ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున సీజే ధర్మాసనం ఎదుట అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మనం ప్రకారమే సర్వే జరిపామని కోర్టుకు విన్నవించారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా పరిగణించాలని అన్నారు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6 శాతంగా తెలిందని ధర్మాసనానికి తెలిపారు. ఆ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లు ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. బీసీ సంఖ్యపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు.. పిటిషనర్లకు రిపోర్టు గురించి ఎందుకు అన్ని ఏజీ వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా బీసీ బిల్లు నెంబర్ 4 కాపీని ఆయన కోర్టుకు సమర్పించారు. మార్చి నుంచి గవర్న్ వద్ద బిల్లు పెండింగ్లో ఉందని.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 6 నెలలు గడిచినందున బిల్లుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నామని, దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు