కథ మళ్లీ మొదటికి.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. స్థానిక ఎన్నికలు వాయిదా..
హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై కూ
హైకోర్టు స్టే


హైదరాబాద్, 9 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై కూడా హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande