ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ.చేసింది
అమరావతి, 9 అక్టోబర్ (హి.స.) అమరావతి: ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏప
ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ.చేసింది


అమరావతి, 9 అక్టోబర్ (హి.స.)

అమరావతి: ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande