సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కోసం భవనాలను పరిశీలించిన ఎంపీ కడియం కావ్య
వరంగల్, 9 అక్టోబర్ (హి.స.) వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ స్థాపనకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, అదనపు డైర
ఎంపీ కడియం కావ్య


వరంగల్, 9 అక్టోబర్ (హి.స.)

వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ స్థాపనకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, అదనపు డైరెక్టర్ డాక్టర్ రోహిణి తో కలిసి గురువారం భవనాలను పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట డివిజన్ మున్సిపల్ కార్యాలయం, దూరదర్శన్ కార్యాలయంతో పాటు వసతి గృహం, వరంగల్ పాత కలెక్టర్ వసతి గృహం, కుడా కార్యాలయాలను సందర్శించి వాటి స్థితిగతులు, సౌకర్యాలు, విస్తీర్ణం వంటి వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డా. కావ్య అధికారులు, ఇంజనీర్లతో కలిసి సెంటర్కు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. భవనం ఎంపిక ప్రక్రియను తక్షణం పూర్తి చేసి సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande