విశాఖ పట్టం, 9 అక్టోబర్ (హి.స.) విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అన్నారు. విశాఖ జిల్లా( Visakha District)నర్సీపట్నం పర్యటనకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఆయన కలిశారు. స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్లాంట్ కార్మికల ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రైవేటీకరణ చేయొద్దని తమ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రత ప్రమాణాలు పాటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌కు విజ్ఞప్తి చేశాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV