బిహార్‌లో 65 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.) బిహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో
బిహార్‌లో 65 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.) బిహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై సుమారు 65 కి.మీ. మేర ట్రాఫిక్‌ స్తంభించింది. గత శుక్రవారం నుంచి నాలుగు రోజులుగా లారీలు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు రహదారిపైనే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క కిలోమీటరు దూరం ప్రయాణించడానికి కూడా కొన్ని గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దిల్లీ- గురుగ్రామ్‌ రహదారిపై 10 కి.మీ. మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande