ముంబయిలో ప్రధాని మోదీ- కీర్‌ స్టార్మర్‌ భేటీ
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-family:Garamond;font-size:17pt;}.cf3{font-family:Nirmala
ముంబయిలో ప్రధాని మోదీ- కీర్‌ స్టార్మర్‌ భేటీ


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:17pt;}.cf2{font-family:Garamond;font-size:17pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:17pt;}.pf0{}

ముంబై,09,అక్టోబర్ (హి.స.)రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ముంబయిలో ప్రధాని మోదీ-స్టార్మర్ భేటీ అయ్యారు (Modi-Keir Starmer). ఈ సమావేశం కోసం రాజ్‌భవన్‌కు వచ్చిన యూకే ప్రధానిని మోదీ స్వాగతించారు. దీనికి సంబంధించిన చిత్రాలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం కలసికట్టుగా అని రాసుకొచ్చారు.

జులైలో భారత్‌-బ్రిటన్‌ మధ్య ‘స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ (ఎఫ్‌టీఏ) కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్‌ ప్రవేశం సులభతరం అవుతుందని అప్పట్లో ఇరుదేశాలు ప్రకటించాయి. ఈ ఒప్పందం నేపథ్యంలోనే 125 మంది ప్రతినిధుల బృందంతో స్టార్మర్ భారత్‌కు వచ్చారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతున్న భారత్‌తో బ్రిటన్‌ ఒప్పందం.. పురోభివృద్ధికి లాంచ్‌పాడ్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి తాము వైదొలిగిన తర్వాత భారత్‌తో కుదిరిన ఒప్పందం కీలకమైందన్నారు. బ్రిటన్‌ ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులపై భారత్‌ సగటు టారిఫ్‌ 15% నుంచి 3 శాతానికి తగ్గనుందని యూకే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande