రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత.. ప్రైవేట్ డాక్టర్స్ కీలక నిర్ణయం
అమరావతి, 9 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో శుక్రవారం నుంచి NTR హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ హాస్పటల్‌కి ప్రభుత్వం దాదాపు రూ.2700 కోట్ల బకాయిలు ఉంది. దీంతో ఈ బకాయిలు విడుదల చేయాలని కొంత కాలంగా ప్రైవేట్ హాస్పటల్‌ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నా
రేపటి నుంచి NTR హెల్త్ సేవలు నిలిపివేత.. ప్రైవేట్ డాక్టర్స్ కీలక నిర్ణయం


అమరావతి, 9 అక్టోబర్ (హి.స.) రాష్ట్రంలో శుక్రవారం నుంచి NTR హెల్త్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ హాస్పటల్‌కి ప్రభుత్వం దాదాపు రూ.2700 కోట్ల బకాయిలు ఉంది. దీంతో ఈ బకాయిలు విడుదల చేయాలని కొంత కాలంగా ప్రైవేట్ హాస్పటల్‌ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సమయం కోరుతూ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది. కానీ రెండు రోజులుగా ప్రైవేట్ డాక్టర్స్ ఆందోళనను ఉధృతం చేశారు. ప్రజాప్రతినిధులను సైతం కలిశారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం నిర్ణయించారు. ఈ మేరకు ప్రైవేట్ డాక్టర్స్ క్లారిటీ ఇచ్చింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande