body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ముంబై: /ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.)అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.
అయితే ద్వితీయార్ధంలో ఎఫ్‌ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు