
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి,
లు సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పవార్ రామారావు పటేల్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ ను హైదరాబాద్ లో కలిసి వినతి పత్రాన్ని అందించారు. సోయాపంట ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఎకరాకు 7.60 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని కోరారు. అదే విధంగా సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు పరిమితిని పెంచాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు