
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
అమరావతి: - విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ కె.విజయానంద్, ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాంతంలో వేర్వేరు జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో సీఎం చర్చించారు.
Tags:
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ