
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
విశాఖపట్నం: త్వరలో విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సులో 400కి పైగా ఒప్పందాలు జరుగుతాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. సుమారు 9లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైకాపాకు ఇష్టం లేదని విమర్శించారు. పేదలను పూర్తి పేదరికంలోనే ఉంచాలనేది వైకాపా సిద్ధాంతమని.. ఆ పార్టీ కుటిల బుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ