అందెశ్రీ కుటుంబానికి అండగా ఉంటాం.. ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) రచయిత అందెశ్రీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని బీజేపీ ముఖ్య నేత, మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓద
ఎంపీ ఈటల రాజేందర్


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)

రచయిత అందెశ్రీ

కుటుంబానికి తామంతా అండగా ఉంటామని బీజేపీ ముఖ్య నేత, మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ కుటుంబానికి తామంతా ముందుండి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆయన ఈ లోకంలో భౌతికంగా లేరు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారని కామెంట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. పేదవాడి గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అందెశ్రీ అని కొనియాడారు. చదుకోకపోయినా... ఇంతటి కీర్తిని ఆర్జించిన వ్యక్తి ఆయనొక్కడేనని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande