విద్యార్థినిలతో కలిసి క్యూలైన్లో నిలుచుని భోజనం చేసిన కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, 10 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం సందర్శించి, పాఠశాల బాలికలతో ముచ్చటించారు. విద్యార్థినీలతో కలసి కలెక్టర్ క్యూ లైన్లో నిలుచుని
భద్రాద్రి కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం, 10 నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం సందర్శించి, పాఠశాల బాలికలతో ముచ్చటించారు. విద్యార్థినీలతో కలసి కలెక్టర్ క్యూ లైన్లో నిలుచుని మధ్యాహ్న భోజనం చేశారు.భోజనం సందర్భంగా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఏ ఉద్యాగాల్లో స్థిరపడతారు అని కలెక్టర్ బాలికలను ప్రశ్నించారు. పాఠశాలలోని కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, డిగ్రీ వరకు చదువుకుని జీవితంలో స్థిరపడిన అనంతరం అమ్మాయిలు పెళ్లి ఆలోచన చేయాలని అభిప్రాయ పడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande