
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలోని గ్రూప్-3 (Group-3)
అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి గాను ఇటీవలే జనరల్ ర్యాకింగ్స్ను విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోను ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పక్రియ నేటి నుంచి ఈ నెల 26 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాల్రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమై సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనుంది. సర్టిఫికెట్ పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో పొందుపరిచారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..