కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెబుతారు: హరీశ్రావు
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్
హరీశ్రావు


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటికీ సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను ఎలక్షన్ కమిషన్కు సమర్పించామని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవో సుదర్శన్రెడ్డికి ఫిర్యాదు చేశారు.

అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది పోలీసులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande